అరుదైన పుస్తకం: - యామిజాల జగదీశ్


 ఒక అరుదైన పుస్తకాల వ్యాపారికి ఒక్కసారిగా వేల సంఖ్యలో పుస్తకాల కోసం పెద్ద ఆర్డర్ వచ్చింది. అనుమానం వచ్చిన వ్యాపారి ఒక పుస్తకంలో ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ బాపతు ట్రాకర్‌ను దాచి పంపారు. అది చివరకు అమెజాన్ సెంటర్‌కు చేరుకుందని తేలింది.
ఇటీవల అనామక వ్యక్తుల నుండి ఇలాంటి పాత, అరుదైన పుస్తకాల కోసం విపరీతంగా ఆర్డర్లు రావడం గమనించిన వ్యాపారి '404 మీడియా' ప్రతినిధులతో కలిసి ఈ పని చేశారు. ఆ పుస్తకం అమెరికా అంతటా వినియోగం లాస్ వేగాస్‌లోని అమెజాన్ సెంటర్‌కు చేరుకుంది.
అక్కడి సిబ్బంది అందించిన సమాచారం ప్రకారం.. ఈ సెంటర్‌కు భారీగా పాత పుస్తకాలు వస్తాయి. వాటన్నింటి బైండింగ్స్ తీసేసి, పేజీలను వేగంగా స్కాన్ చేస్తారు. ఆ తర్వాత అసలు పుస్తకాలను చెత్తలో పడేసి పూర్తిగా నాశనం చేస్తారు.
కృత్రిమ మేధ (AI) వ్యవస్థలకు శిక్షణ ఇవ్వడానికి నాణ్యమైన సమాచారం కావాలి. జనరేటివ్ ఏఐ రాకముందు మనుషులు రాసిన పాత పుస్తకాలు ఈ ఏఐ మోడళ్ల ట్రైనింగ్ కోసం బాగా ఉపయోగపడతాయి. అందుకే వీటిని సేకరిస్తున్నారని ఈ పరిశోధన ద్వారా తెలిసింది.
తమ ఉత్పత్తులను, వస్తువులను అందుబాటులో ఉంచడానికి అందుబాటులో ఉన్న పుస్తకాలను కొనుగోలు చేయడానికి కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఈ నిర్దిష్ట పుస్తకాలను ఏఐ ట్రైనింగ్ కోసమే కొన్నామని చెప్పలేదు.
ఒక అరుదైన పుస్తకం సాహిత్యంలా కాకుండా ఏఐ ట్రైనింగ్ డేటాగా మారిపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
కామెంట్‌లు