మా మంచి సొరకాయ
బరువుగా ఉండుకాయ
పెరటిలోని సొరకాయ
ఆకుపచ్చని వలువ
అమూల్యమేగ విలువ
కూరతింటే చలువ
పోషకాలకు నిలువ
జీర్ణమగును వేగిరం
వండవచ్చు త్వరితం
అరగుదల సులభం
కలిగించును సంతోషం
సొరకాయ కూరతినరా
పులుసు తింటే బాగుండురా
సొరకాయతో అట్టుందిరా
తిన్నావంటే వదలవురా
చిన్నా పెద్ద తినవచ్చు
అందరికీ ఇది నచ్చు
లేతకాయను గిచ్చు
గాటు పడితె కొనవచ్చు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి