గాజుల నాదాలు.: -పాలగుమ్మి జ్యోతి.


గాజుల అబ్బి వచ్చాడు 
 రంగుల గాజులు తెచ్చాడు 
 మలారం దించి పిలిచాడు 
 పాపల చేతికి తొడిగాడు!!

 పిల్లలకు తొడిగిన గాజులు
 రకరకాల మట్టి గాజులు 
 చేసెను గలగల సవ్వడులు
 ఆడపిల్లలకవి అందాలు!!

 పాపకు నల్లని గాజులు
 పోగొట్టును దృష్టిదోషాలు 
 అమ్మ చేతిన గాజులు 
 పాపకు ఆట బొమ్మలు!!

 రాళ్ళను పొదిగిన గాజులు 
 పూసలు గుచ్చిన గాజులు 
 హరివిల్లులోని వన్నెలు 
 చూసి మురిసెను కన్నులు!! 
కామెంట్‌లు