భలే మంచి చౌకబేరం : -డా సి.వసుంధర


రాలిపోతున్నాయి వడ పిందెలు
జాలేలేని జగతి
పోనీలే అంటున్నాది 

మనుష్య లోకంలోమకాం పెట్టారు. దానవలోకం ఖాళీ అయింది
మానవత్వము పూడ్చబడింది

ప్రపంచీకరణ  అంటే
" ప్రపంచమంటే 
  ఛీ ఇదేనా?"
అనే స్థాయికి 
దిగజారింది .

కూరలు పండ్లు తినే వస్తువులు వాడుకునే విషయాలవలే
మనిషి మహా చక్కగా అమ్ముడుపోతున్నాడు.

వసివాడని పసి మొగ్గలు 
కసి కసిగా నుసై పోతున్నాయి.
అట్టడుగు ప్రజలకు పిల్లల్ని పుట్టించడమే తెలుసు. 
ప్రస్తుతంలో వారి
పిల్లలకు స్వర్గం చూపించకపోతే పోయారు నరకం చూపిస్తున్నారు. 

అమ్మకానికి అమ్మలు పిల్లలని కంటే వాళ్లు నిజంగా అమ్మ లేనా!

పేపర్లో వార్తలు, 
పుస్తకాల్లో కథలు కవితలు, అంతటితో సరి

సమస్యకు పరిష్కారం  అంటే అందరూ పెడతారు ఒక నమస్కారం..
అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి 
అమ్మతనం లో
కమ్మదనం 
కాలిపోయి కూలిపోయి చాలా రోజులైంది.
మనిషి మనిషిగా బ్రతికే రోజులు మరుగైపోయాయి.  అమ్మాయిల మొదలు
అన్నిప్రాణుల
ఆమ్మకం అతి జోరుగా సాగుతోంది.
కామెంట్‌లు