కొంగలు : - వరలక్ష్మి యనమండ్ర


కొంగలు కొంగలు కొంగలు! 
తెల్లని రెక్కల హంగులు!
రైతుల హితులే కొంగలు! 
పురుగుల అరులే కొంగలు!

చేపల మోసం చేస్తాయి! 
రైతుకి సాయం చేస్తాయి!
చెట్లపై వరుసగ ఉంటాయి!
సమూహాలుగా ఉంటాయి!

ఒంటి కాలిపై నిలబడతాయి 
తపమొనరిస్తూ కనబడతాయి!
చేపల కోసం ఎగబడతాయి!
ఠక్కున చేపను నోట పడతాయి!

టిక్కెట్టు లేనిది వీటి ప్రయాణం
ఇక్కట్లు తెలియని తెల్ల విమానం
తెలివైన కొంగల జీవనయానం!
పక్షి జాతిలో కొత్త ప్రమాణం!
కామెంట్‌లు