తాజ్ మహల్ ని చూస్తారు గాని
చెదిరిపోయిన చరిత్రను
కూలిపోయిన కోట గోడలను
కాదు కదా....!!
ఎవరైనా నిటారుగా నిలబడ్డ
కుతుబ్మినార్ ని చూస్తారు గాని
కూలిపోయిన గాలిగోపురాలను
కాదు కదా.......!!!
ఎవరైనా చెక్కుచెదరని
చార్మినార్ ని చూస్తారు గాని
శిథిలమైన గోల్కొండ ను కాదు కదా...!!
ఎవరైనా కాకతీయ తోరణాన్నే
ఆహ్వానిస్తారు గాని
మరిచిపోయిన కాకతీయ సామ్రాజ్యాన్ని
కాదు కదా........!!!!
ఎవరైనా రామప్ప వేయి స్తంభాల
గుడినే గుర్తు చేసుకుంటారు గాని
కాలిపోయిన కూలిపోయిన
రాజులను రాజ్యాలను కాదు కదా....!!!?
చరిత్ర కూడా చిత్రంగా చచ్చిపోతుంది
సమాధులు మిగులుతాయి..!!
నదులు నాగరికతలు నగరాలు కూడా
సమిదలవుతాయి చెదిరిపోతాయి
సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగులుతాయి...!!?
===============================
డా ప్రతాప్ కౌటిళ్యా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి