కళారత్న బిక్కి కృష్ణ: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


ఎన్నో విజయాలు సాధించాడు మన బిక్కి కృష్ణ 
ఎన్నో సభలు నిర్వహించాడు మన బిక్కి కృష్ణ  

సభాసామ్రాటు కళారత్నగా పేరు పొందాడు 
ఎన్నో సన్మానాలు పొందాడు మన బిక్కి కృష్ణ 

లయాత్మకంగా భావాత్మకంగా రంగరిస్తూ 
ఎన్నో గొప్పకవితలు వ్రాశాడు మన బిక్కి కృష్ణ 

ఎందరో యువకవులను తట్టి ప్రోత్సాహమిచ్చాడు 
ఎన్నో సత్కారాలు చేశాడు మన బిక్కి కృష్ణ 

తన జీవిత అనుభవాలను అక్షరాలలో పెట్టాడు 
ఎన్నో పుస్తకాలు రచించాడు మన బిక్కి కృష్ణ 

ఎందరో కవనప్రేమికుల సహకారం తీసుకొని 
ఎన్నో సంస్థలను స్థాపించాడు మన బిక్కి కృష్ణ 

సాహితీలోకాన దృవతారగా వెలుగుతున్నాడు 
ఎన్నో హృదులు దోచుకున్నాడు మన బిక్కి కృష్ణ 

కామెంట్‌లు