హయగ్రీవ జయంతి - విశిష్టత : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - (పుష్యమి)- సెయింట్ లూయిస్ - అమెరికా.


 దక్షిణాయన పుణ్యకాలంలో వర్షఋతువులో  పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి వేద పరిరక్షకుడు మేథా సంపతిని విద్యను ప్రసాదించే హయగ్రీవుని జయంతి. దేవి భాగవతం స్కాందపురణ మహాభాగవతా లననుసరించి    అశ్వముఖం గల  హయగ్రీవుడనే రాక్షసుడు  బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేస్తే బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమైన సమయాన తాను తన ముఖంగల వాని చేతిలోనే మరణం కలిగేటట్లు వరం పొంది గర్వంతో మహనీయులను ఋషులను దేవతలను కష్టాలు పాలుచేయగా వారు పార్వతీ పరమేశ్వరులను అర్థింప ఆది దంపతులు పాలకడలిలో  వింటిని తలపెట్టుకు నిద్రిస్తున్న  స్థితి కారకుడైన శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళి పరమేశ్వరుడు చెదపురుగు గా మారి వింటి నారిని కొరికిన  విష్ణువు తల తెగిన సందర్భంగా వెదకి గుర్రం తలను  పార్వతీ పరమేశ్వరులు, దేవతాది  మునులు  స్తోత్ర పారాయణం ప్రార్థనలతో అమర్చిన విష్ణుమూర్తి హయగ్రీవుని అవతారంతో సంహరించెను 
హయగ్రీవ రూపం  అశ్వముఖం .హయగ్రీవుని పూజిస్తే అజ్ఞానం తొలగి ఙ్ఞానం ప్రాప్తిస్తుందని ఋషులు చెప్పారు బుద్ధి, జ్ఞాపక శక్తి ,చదువులో విజయం  లభిస్తాయని నడయాడే పరమేశ్వర స్వరూపమైన కంచి పరమాచార్య చెప్పారు.  
      హయగ్రీవ జయంతి రోజున తెల్లవారు జామున లేచి అభ్యంగన స్నానం చేసి పూజా గదిని పవిత్రం చేసి హయగ్రీవ  విగ్రహం పెట్టి మొదట విఘ్నేశ్వర పూజ చేయాలి. తరువాత లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుని కి యాలకులకు మాలను సమర్పించి  షోడశోపచారాలతో అష్టోత్తర శత నామాలతో భక్తి శ్రద్ధలతో పూజించి 
శనగ పిండితో చేసిన లడ్డు,గుగ్గిళ్ళు నివేదనచేయాలి
పూజా సమయంలో హయగ్రీవ శ్లోకం 
ఙ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాకృతం
ఆధారం సర్వ విద్యానా0
హయగ్రీవ ముపాస్మహే..! పఠిస్తే  ఙ్ఞానం, ధారణ లభిస్తుందన్నది  హయగ్రీవ పూజ శత్రువినాశకం అని కూడా  పెద్దలు చెబుతారు 
హయగ్రీవ, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం ద్వారా జ్ఞానం లభిస్తుందని  ప్రవచన కారులు చాగంటి, గరికపాటి, సామవేదం చెప్పినది ఆచరిద్దాం సనాతన ధర్మం వసుదైకానికి ఆదర్శంగా నిలుద్దాం...!!
................................
కామెంట్‌లు