జీవనచక్రం: - కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-సెయింట్ లూయిస్-అమెరికా
 పరమాత్ముని అనతితో
పుడమి పై పుట్టినది మొదలు 
ధరణిలో కలిసేవరకు
బాల్య యవ్వన వృద్ధాప్యాలు సహజం.
అనుకోని అవాంతరాలు ఎదురవ్వక పోతే 
ప్రతి మనిషి మూడు దశలను అనుభవించాలి

 

ఆది శంకరులు చెప్పినట్లు
పునరపివజనన0 పునరపి మరణం అని 
'జాతహస్యహి ధ్రువో మృత్యు: 'అని తెలుసుకు
బాల్యంలో తల్లితండ్రుల ఆలనా పాలనతో
వివాహమైన తరువాత భాగస్వామి పిల్లల మధ్య 
బాధ్యతలు తీరిన వేళ 
వృద్ధాప్యంలో  ఇతరులపై 
ఆధారపడటం
జీవితం అశాశ్వతమని
కష్ట సుఖాలలో కలిమిలేములలో 
కర్తవ్యాన్ని మరువక 
సమాజన  ప్రజలతో
అనురాగ ఆప్యాయతలతో మెలుగుతు 
గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు 
స్థితప్రజ్ఞతకు దర్పణంగా ఉన్న మానవుని జీవితం 
వేదంలో చెప్పినట్లు 
పూర్ణమదం పూర్ణ మిద0
అన్నదానికి ప్రతీకయే...!!
...............................

కామెంట్‌లు