అందమైన పండుగ : - డా . .సి. వసుంధర-చెన్నై


"కేరళ స్త్రీలు, తెలుగు భాష అందమైన విషయాలు" 
అన్న సుబ్రహ్మణ్య భారతి మాట 
సత్యాల మూట 
   మలయాళీల
 స్వచ్ఛతకు గుర్తు 
శ్వేత వస్త్రాలే. 


మలయాళీల పది రోజుల
 పంటల పండగ 
ఓనం. 
వారి క్యాలెండర్లు మొదటి నెల చింగం ( ఆగస్టు సెప్టెంబర్) 
కథ
మన బలి చక్రవర్తి  కథే  
తొలి రోజు "అత్తమ్" పలువర్ణపుష్పాల రంగవల్లుల సింగారింపు 
పదవరోజు "పురాండం" మహాబలి మట్టి బొమ్మ
 పూజ ఇది సంతరించుకుంది ప్రాముఖ్యత. 

బోనం కార్యకలాపాలు కడు ప్రశంసనీయాలు 

"పణం సద్య" 
26 పదార్థాలతో రంభ పత్రంలో (అరిటాకు)
కమ్మని విందు భోజనం. "ఆస్తులన్నీ
 అమైనా చేయాలి ఓనం బిందు" అని  మలయాళీల సామెత

"వల్లంకలి" పాముల వంటి పడవలలో పరుగుల పందెం

పులికాలి,తిరువ తిరుకలి కొట్టికలి 
 నృత్యాలు చక్కని దృశ్యాలు 

మగమహారాజులు చొక్కా ముంగి 
ఆడ మహారాణులు ముండు సరియతు వస్త్రధారణలు. 

దేవాలయాల్లో సందడే సందడి 
తిరువోనంరోజు
బలి చక్రవర్తి వచ్చి
పలకరింపగా ప్రతి మలయాళీ పులకరిస్తాడు 
అది వారి నమ్మకం.ఇందులో ప్రాంతీయ బేధాలు తప్పవు 
మొత్తం మీద 
అందాల కేరళలో 
ఆనందాల ఓనం పండుగ వేడ్కలు  చూడని జన్మ దండగ.☺️
కామెంట్‌లు