మనకు వినబడకుండా చెప్పుకునే
గుసగుసలకు భయపడడ మెందుకు
ఏదో జరిగిందని బాధపడడమెందుకు
ఏనుగు నడిచి వెళ్తుంటే
గ్రామసింహాలు ఊరుకుంటాయా
వాటి పని అవి చేస్తూనే ఉంటాయి కదా
నీ ఉన్నతిని చూసి ఓర్వలేని వాళ్లు
తమ లక్ష్యాలను చేరుకోలేక
చతికిలపడిన చేవలేని మనుషులు
నీ గురించే మాట్లాడుతుంటారు
నీపై నిందలు వేస్తూనే ఉంటారు
పోనీ... వారి పని వారిని చేసుకోనివ్వు
వారి కొరకు నీ పయనం ఆపకు
నీ అడుగులు తప్పుదారిలో
పడనంతవరకు నీకెందుకు భయం
నీవు దారి తప్పనంతవరకు
నీకెందుకు లేనిపోని బాధ
నీ మనస్సాక్షికి మాత్రమే సమాధానమివ్వు
నీ అంతరాత్మకే జవాబుదారీగా నిలువు
నిన్ను నీవు తెలుసుకోగలిగితే
ఎందుకు వివరణ ఇవ్వాలి పరులకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి