ఎగతాళి చేసినవాళ్లను తన గెలుపుతో సమాధానమిచ్చిన నిజమైన హీరో "ఆర్నాల్డ్" చెప్పిన మాటలు....
నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు 'నేను అమెరికా వెళ్తాను' అని చెప్పినప్పుడు అందరూ నన్ను చూసి నవ్వారు. కానీ నేను అమెరికా వెళ్లి స్థిరపడ్డాను!
నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు 'ప్రపంచ మిస్టర్ యూనివర్స్ అవుతాను' అన్నాను. అప్పుడూ అందరూ నవ్వారు. నేను ఆ టైటిల్‌ను ఎన్నో సార్లు గెలుచుకున్నాను!
ఆ తర్వాత 'సినిమాల్లో పెద్ద హీరో అవుతాను' అని చెప్పినప్పుడూ అందరూ ఎగతాళిగా నవ్వారు. నేను హాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా మారాను!
సినిమాల్లో నాకు ఎదురుదెబ్బ తగిలినప్పుడు 'ఇక వీడి పని అయిపోయింది' అని నవ్వుకున్నారు. కానీ నేను మళ్లీ అద్భుతంగా పుంజుకున్నాను!
నాకు 50 ఏళ్ల వయసులో 'నేను కాలిఫోర్నియా గవర్నర్ అవుతాను' అని చెప్పినప్పుడు కూడా నన్ను చూసి అందరూ నవ్వారు. చివరికి నేను గవర్నర్ అయ్యాను!
ఇప్పుడు నన్ను చూసి నవ్వినవాళ్లను చూసి నేను వెనక్కి తిరిగి నవ్వుతున్నాను. వాళ్లంతా ఇప్పటికీ అక్కడే ఉండిపోయారు!
ఆత్మవిశ్వాసం, కఠిన శ్రమతోనే నేను అనుకున్నవన్నీ సాధించగలిగాను.
ఏదైనా సాధించాలి అనుకునేవాళ్లు చుట్టూ ఉన్నవాళ్ల ఎగతాళి మాటలను పట్టించుకోకూడదు. అది వాళ్ల బలహీనత!
మన గురించి గానీ, మనలోని ఆత్మవిశ్వాస బలం గురించి గానీ వాళ్లకు ఏమీ తెలియదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి