ఓటా బెంగా: - యామిజాల జగదీశ్
 

ఓటా బెంగా ప్రస్తుత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన ఎంబుటి తెగ వ్యక్తి.
బెల్జియం రాజు రెండవ లియోపోల్డ్ కాంగోను తన గుప్పెట్లో ఉంచుకున్న క్రూరమైన పాలనలో అతని జీవితం నాశనమైంది. ఆ కాలంలో హింస, వెట్టిచాకిరీ, దోపిడీల వల్ల లక్షలాది మంది ఆఫ్రికన్లు తీవ్రంగా నష్టపో యారు.
1904లో శామ్యూల్ వెర్నర్ అనే అమెరికన్ అన్వేషకుడు, సెయింట్ లూయిస్ వరల్డ్స్ ఫెయిర్‌లో ప్రదర్శించడానికి ఓటా బెంగాను అమెరికాకు తీసుకెళ్లాడు.
కొన్నేళ్ల తర్వాత, అంటే 1906లో, న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జంతు ప్రదర్శనశాలలో ఆయనను జంతువు లతో కలిపి ఉంచారు. ఒక "ఆదిమ" మనిషికి ఉదాహరణగా చూపిస్తూ సందర్శకులు ఆయనను వింతగా చూసేలా చేశారు.
అయితే ఈ చర్య తీవ్ర దుమారం రేపింది. నల్లజాతి మతబోధకులు, పౌరహక్కుల నాయకులు దీనిని తీవ్రంగా నిరసించారు. ఇది అత్యంత వివక్షతో కూడిన, అవమానకరమైన చర్య అని ఖండించారు.
ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవ్వడంతో, జూ యాజమాన్యం చివరికి ఆయనను ఆ ప్రదర్శన నుంచి తొలగించింది.
ఆ తర్వాత ఓట బెంగా అమెరికాలోనే ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించారు. ఇంగ్లీష్ నేర్చుకున్నా రు. రకరకాల పనులు చేశారు. ఎప్పటి కైనా తన సొంత దేశానికి తిరిగి వెళ్లా లని ఆశపడ్డారు. ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలవ్వడంతో ప్రయాణాలు నిలిచిపోయాయి. దాంతో సొంత నివాసానికి దూరంగా అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఆ ఒంటరితనం, నా అనేవారు లేని బాధ, సొంత గూటికి చేరలేకపోయాన నే బాధతో ఓట బెంగా 1916లో, దాదాపు 32 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని కన్నుమూశారు.
కామెంట్‌లు