"ఛ... మాకు తెలీదా" అనే మాట ఈ రోజుల్లో చాలా సులభంగా వినిపిస్తుంది. కానీ నిజంగా మనకు తెలిసింది ఎంత, తెలిసినట్టు నటించేది ఎంత.ఎవరైనా సలహా ఇస్తే "మాకు తెలీదా" అంటాం. తప్పును చూపిస్తే "అది కూడా తెలుసు" అంటాం. కానీ అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటాం.అదే లైఫ్‌లో ఉండే మ్యాజిక్.మన బలహీనతలు మనకే తెలియనట్టుగా ప్రవర్తిస్తాం. మన కోపం, అహంకారం, అసూయ, నిర్లక్ష్యం గురించి మాట్లాడితే వినడానికి ఇష్టపడము. ఎందుకంటే మనల్ని మనం సరిచేసుకోవడం కంటే, ఇతరులను విమర్శించడం చాలా సులభం కదా.ఈ కాలంలో ఆత్మవిశ్వాసం కంటే ఆత్మపరిశీలన తక్కువైపోయింది. తెలిసినట్టు మాట్లాడేవాళ్లు ఎక్కువ, తమను తాము అర్థం చేసుకునేవాళ్లు తక్కువ.
ఈసారి "ఛ... మాకు తెలీదా" అని చెప్పే ముందు ఒక్కసారి మనసులోకి తొంగి చూసుకోవటం బెటర్.
"ఛ... మాకు తెలీదా"అనేది మనకు ఇష్టమైన డైలాగ్...
"ఛ ఛ... ఇదే తప్పు మళ్లీ చేశావా" అనేది జీవితానికి ఇష్టమైన రిప్లై
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి