కవి భావాల లోతుల్లో ఈదే ఒక సృజనశీలి...
రచయిత సమాజ దర్పణాన్ని చూపే ఒక దార్శనికుడు...
ఒకరు మనసు పొరల్లోని మౌనాన్ని వినిపిస్తే...
మరొకరు లోకపు తీరుతెన్నుల భాష్యం చెబుతారు...
కవికి ఆయుధం ఊహల ఊయలలూగే కల్పన...
రచయితకు ప్రాణం వాస్తవాల పునాదిపై కట్టిన నిర్మాణం...
కవిత రసగుళికలా గుండెను తాకితే...
రచన విజ్ఞానపు కాంతిలా మెదడును తట్టిలేపుతుంది...
ఒకరికి పదాల పొందిక ఒక అందమైన నృత్యం...
మరొకరికి వాక్యాల అమరిక ఒక ఆలోచనా యజ్ఞం...
కవి ఆకాశపు నీలిమలో రంగులు వెతికితే...
రచయిత నేలతల్లి నొసటి రాతలను చదువుతాడు...
కానీ, ఈ ఇద్దరి లక్ష్యం అక్షర ఒకటే ఉద్దరణ...
ఒకరు అందాన్ని ప్రేమిస్తే మరొకరు అర్థాన్ని గౌరవిస్తారు...
సమన్వయపు వేదికపై ఇద్దరూ అక్షర యోధులే...
మానవత్వపు పరిమళాన్ని వెదజల్లే జ్ఞాన ప్రదీపులే...
భావం లేని రచన ప్రాణం లేని బొమ్మ వంటిది...
వాస్తవం లేని కవిత్వం గమ్యం లేని ప్రయాణం వంటిది...
అందుకే, కవిత్వపు భావుకత.. రచనలోని గాంభీర్యం కలిస్తే...
అదే అక్షరానికి పట్టే అఖండమైన నీరాజనం...
..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి