మనుషులెక్కడుంటారు..!!?: - డా ప్రతాప్ కౌటిళ్యా.


మన దగ్గర మనుషులు లేరు 
మనుషులు ఎక్కడుంటారు. 
మనుషులు ఊర్లలల్లోఉండరు
మహానగరాల్లో ఉంటారు......
మనుషులు సేవల్లో ఉండరు 
రాజకీయాల్లో ఉంటారు.....!!

మన దగ్గర మనుషులు లేరు 
మనుషులు ఎక్కడుంటారు 
మనుషులు ఉపకారాల్లో ఉండరు 
వ్యాపారాల్లో ఉంటారు........!!
మనుషులు దేశభక్తిలో ఉండరు 
మత్తులో ఉంటారు...........!!

మన దగ్గర మనుషులు లేరు 
మనుషులు ఎక్కడుంటారు 
మనుషులు స్నేహంలో ఉండరు 
జూదంలో ఉంటారు............
మనుషులు సదాచారాల్లో ఉండరు 
వ్యభిచార గృహాల్లో ఉంటారు....!!!

మన దగ్గర మనుషులు లేరు 
మనుషులు ఎక్కడుంటారు 
మనుషులు కాయలు కాసే చెట్ల దగ్గర ఉండరు 
పైసలు కాసే చెట్ల దగ్గర ఉంటారు..!
మనుషులు విజ్ఞానం జ్ఞానం దగ్గర ఉండరు 
అజ్ఞానం దగ్గర ఉంటారు........!!

మన దగ్గర మనుషులు లేరు 
మనుషులు ఎక్కడుంటారు 
మనుషులు ప్రేమ దగ్గర ఉండరు
ఆకారణ ద్వేషం దగ్గర ఉంటారు..!
మనుషులు కలం దగ్గర ఉండరు 
కులం దగ్గర ఉంటారు...........!!

మనుషులు మన దగ్గర లేరు 
మనుషులు ఎక్కడుంటారు 
మనుషులు మానవజాతి దగ్గర ఉండరు 
మతం దగ్గర ఉంటారు.........!!
మనుషులు సమాజంలో ఉండరు 
సమాచారాల్లో ఉంటారు........!!?
===============================
డా ప్రతాప్ కౌటిళ్యా 
విశ్రాంత అధ్యాపకులు.
కామెంట్‌లు