మొక్కలు నాటడంతోపాటు రక్షించాలి
 (ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వనమహోత్సవం) 
     

 మొక్కలు నాటి వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని, పర్యావరణం పరిరక్షణకు అందరు కృషి చేయాలని అప్పుడే మానవమనుగడ సాధ్యమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి గారు అన్నారు. 
          ఆగష్టు 24న యెల్లారెడ్డిపేటలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్ పద్మావతి గారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఐదు మొక్కలకు తగ్గకుండా నాటాలని వాటిని రక్షించాలనీ, కాలుష్యం నుండి పర్యావరణం రక్షించుకోవాలని అన్నారు. 
        జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులకు శ్రమజీవనం,సేవాభావం నాయకత్వం, సామాజిక స్పృహ అలవడుతాయనీ, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా రాణిస్తారనీ, మొక్కలు నాటడం ద్వారా వేడి తీవ్రత తగ్గి, వర్షాలు కురుస్తాయని, స్వచ్ఛమైన గాలి లభిస్తుందని,కరువు కాటకాలు రావనీ పర్యావరణం పరిరక్షించే బడుతుందనీ అన్నారు.
         ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్. పద్మావతి గారు, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు, అధ్యాపకులు క్యాతం సత్యనారాయణ, మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్, జ్యాతోతు శ్రీనివాస్, గజ్జెల గంగాధర్, అనుముల రవిచంద్ర, వెల్దండి సౌమ్య, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, కనిమేని దేవేందర్, నిఖిల్ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు