జన్మజన్మల బంధం - అన్నా చెల్లెలి అనుబంధం; - " కావ్యసుధ "



తరతరాల నుండి అన్నాచెల్లెళ్ల  - 
అనుబంధానికి ప్రతీక  - రాఖీ 
పౌర్ణమి నాడు అన్నాచెల్లెళ్ల                             
అనుబంధం  -  అపురూపం 

 చరణం :
చెల్లెలి  అనురాగం - తీరని మమత 
అన్న ఆశీర్వాదం - కొండంత భరోసా
అన్నాచెల్లెళ్ల అనుబంధం -  తెగని బంధం 
జన్మజన్మల అనుబంధం  - చెరగని బంధం 

 చరణం :
అమ్మ కన్నా ముందు లేచి  -
చెల్లి రాఖీ అల్లింది 
కోడి కూయక ముందే  - అన్న కోసం                              
 దీపారాధన చేసింది

 చరణం

ఎంత దూరం వెళ్ళినా - 
చెల్లి జ్ఞాపకం వెంటాడు
ఎన్ని కష్టాలు వచ్చినా  - 
అన్న ఉన్నాడేనే ధైర్యం 
ఒకే కడుపున పుట్టారు 
ఒకే ప్రాణంగా బతుకుతారు 

తరతరాల నుండి.......
పౌర్ణమి నాడు...........
చెల్లెలి అనురాగం......
అన్న ఆశీర్వాదం.......
అన్నా చెల్లెలు అనుబంధం 
జన్మజన్మల బంధం
###########################
" కావ్యసుధ "
''వాజ్ఞ్మయ భూషణ''
" సాహితీ శిరోమణి "
 విశ్రాంత సీనియర్ జర్నలిస్ట్,
 హైదరాబాద్
 9247313488
కామెంట్‌లు