కళ్ళల్లో కన్నీళ్ల లా గుండెలో బాధ లేకుండా
భావోద్వేగాలు ఉద్భవించవు....
ఆలోచనలతో కళలను కనలేము కానీ
కలలను కనవచ్చు.
గాలిలా హృదయము కనిపించదు కానీ
శ్వాసలా జీవం పోస్తుంది....
పరిమళంలా హృదయము కనిపించదు కానీ
గంధపు వనంలా మౌనంగా ప్రేమ మూర్తిలా మారుతుంది.
కనిపించని శబ్దం హృదయంలా మారు మ్రోగుతుంది
గుండె గుడిలో కీర్తనలా.....
జయము హృదయం అయితే ఆలోచన పలకదు
విజయం ఆలోచనదైతే హృదయం పిలవదు.
రెంటిని కలిపేది ఇష్టమా లేక కష్టమా..........!?
నిజంగా రెంటినీ కలిపేది కష్టమే..................!!
బాధ లేకుండా భావోద్వేగాలు లేవు కళలు లేవు.
ఆలోచనలు లేకుండా కలలు లేవు................!!
ఆలోచనలతో భావోద్వేగాలను మార్చవచ్చు
భావోద్వేగాలతో ఆలోచనలను మార్చవచ్చు.
కళలతో కలలను మార్చవచ్చు..!
కలలతో కళలను మార్చవచ్చు...!!
=====================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి