ఒక గ్రామంలో రాథోడ్,డేవిడ్ అనే ఇద్దరుపిల్లలు ఉన్నారు.రోజు బడికి వెళ్తారు.ఒకరోజు వెళ్తుంటే మార్గ మధ్యలో వాళ్లకు ఒక కాగితం దొరుకుతుంది.
అప్పుడు వాళ్లు ఇలా అనుకుంటారు.ఇది పనికి రాని కాగితం చింపేద్దాం అనుకొనిచింపివేస్తారు.
వెంటనే అది మాట్లాడు తుంది.చింపిన కాగితం వీళ్ళ దగ్గరికి వస్తుంది.ఏం కావాలో కోరుకోమంటుంది.అప్పుడు ఆ పిల్లలు కాగితాన్ని ఇలా అడుగుతారు.మాకు దారితెలియక ఇక్కడికి వచ్చాము.మా ఇంటికి దారిచూపండి అంటారు.
కాగితం ఇలా అంటుంది. మీరు ముందుగాఎదురుగా ఉన్నగుహలోకి వెళ్ళండి.తర్వాత ఇంటికి దారి చెప్తాను అంటుంది.
అప్పుడు రాథోడ్, డేవిడ్ ఇద్దరు గుహలోకి వెళ్తారు. చాలా దూరం వెళ్ళాక వాళ్లకు కొన్ని బంగారు నాణేలు దొరుకుతాయి. ఇంకా దూరం వెళ్ళాక వాళ్లకు వెండి నాణాలు దొరుకుతాయి.ఇంకా కొంత దూరం నడిచిన తర్వాత వాళ్లకు వజ్రాలు దొరుకుతాయి.ఆ ఇద్దరు పిల్లలు అవన్నీ బ్యాగ్ లో పెట్టుకొని గుహలో నుంచి బయటకు వచ్చి కాగితాన్ని ఇలా అడుగుతారు.మేము ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలి.అప్పుడు కాగితం ఇలా అంటుంది.
మీకు నేనుమీకు ఒక మహిమ గల్ల కారు ఇస్తాను. వెంటనే మీ ఇంటికి చేర్చుతుంది అని అంటుంది.వేగంగా కారెక్కి ఇంటికి వెళ్తారు.వాళ్ళ అమ్మ ఇంతసేపు మీరు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది.అప్పుడు పిల్లలు వాళ్ళ బ్యాగులో ఉన్న బంగారు నాణేలు, వెండి నాణేలు,వజ్రాలు చూపిస్తారు.ఇవన్నీ మీకు ఎలా వచ్చాయి. దొంగతనంచేశారా?అని అడుగుతుంది.రాథోడ్, డేవిడ్ జరిగిన విషయమంతా చెపుతారు.అప్పుడు వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది. పిల్లల ధైర్యాన్ని మెచ్చుకొని అభినందనలు తెలుపుతుంది.
Chinna age lo chaala aalochisthunnav
Atlane raayi beta
Thankful to the Telugu teacher laxmaiah sir for motivating her
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి