కొమ్మలలో దాగిందమ్మ
జామపండు కొరికీయమ్మ
కొమ్మ ఊయల ఊగమ్మ!!
పంజరంలో బందీవే
జాతకాల పంతులువే
మెడలో గొలుసు తొడిగేవే
వయ్యారంగా నడిచేవే!!
చిలుక మాటలను నేర్చింది
ఆకలి అంటూ అడిగింది
కూరముక్కలను తిననంది
ఆపిల్ పండును తెమ్మంది!!
వరి కంకులపై వాలింది
బాల్చీలో నీరు త్రాగింది
గజ్జల కాళ్ళతో నడిచింది
ముద్దుమాటలు పలికింది!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి