ఆటకదరా శివా : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - (పుష్యమి)-సెయింట్ లూయిస్ - అమెరికా.


పరమేశ్వర ఆనతితో పుడమిపై పుట్టామని 
మనుగడకు కారణం త్రినేత్రుడేనని
భూలోక కైలాసమే మానస సరోవరమని 
శ్వేతవర్ణపు హిమాలయాలు 
మానసిక ప్రశాంతతకు దోహదపడునని
మన సనాతన ధర్మం వసుదైకానికే ఆదర్శమని
జీవితంలో ఒకసారైనా మానస సరోవరయాత్ర చేస్తే 
జీవన్ముక్తి లభించునని 
దేశ విదేశాల నుంచి   
వ్యయప్రయాసలకోర్చి
వచ్చిన ప్రజలు
హర హర మహాదేవ 
శంభో శంకరా అని 
భక్తి శ్రద్ధలతో  నిను ప్రార్థింప 
అకస్మాత్తుగా వచ్చిన జలప్రళయంలో
గ్రామాలకు గ్రామాలు కొట్టుకు పోయి
అందనిలోకాలకు వెళ్ళి 
అయిన వారి కడుపు కోతకు కారణమైన సంఘటన చూసి 
ఆర్ద్రతతో 
డెబ్బది సంవత్సరాlu దాటిన వయస్సులో వయస్సులో అనుకున్నా 
తప్పిదం ఎవరిదైనా 
ఏ నిమిషానికి ఏమి జరుగునో
ఆటకదరా శివా ఆట కద కేశవా 
జాతస్యహి ధ్రువో మృత్యు: అన్నది నిజమన్నది...!!
.................................

కామెంట్‌లు