మైక్ టైసన్: - యామిజాల జగదీశ్


 సుప్రసిద్ధ బాక్సర్ మైక్ టైసన్ ఒకానొకప్పుడు తన భార్యతో కలిసి ఓ జూకి వెళ్లారు.
అక్కడ ఉన్న గొరిల్లాలను చూస్తున్నప్పుడు, ఉన్నట్లుండి ఒక పెద్ద సిల్వర్‌ బ్యాక్ గొరిల్లా మిగిలిన వాటిని భయపెడుతూ దాడి చేయడం మొదలుపెట్టింది. దీనిని గమనించిన టైసన్ ఆ గొరిల్లా ప్రవర్తనకు బాగా కోపం వచ్చింది. దానితో దాన్ని చితకబాదడానికి బోను తలుపులు తెరవమని చెప్పి, అక్కడ పనిచేసే వ్యక్తికి 10,000 డాలర్లు ఇస్తానని ఆఫర్ చేశారు.
కానీ జూ ఉద్యోగి అందుకు ఒప్పుకోలేదు. నిజానికి అది మంచిదే అయింది.
టైసన్ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన హెవీవెయిట్ బాక్సర్లలో ఒకరైనప్పటికీ, పూర్తిగా పెరిగిన సిల్వర్‌బ్యాక్ గొరిల్లాతో పోరాడటం అనేది చాలా ప్రమాదకరం.
గొరిల్లాలకు శరీర పైభాగంలో విపరీతమైన బలం, శక్తిమంతమైన దవడలు, పొడవైన చేతులు ఉంటాయి. కనురెప్పపాటులో అవి ప్రాణాంతకమైన గాయాలు చేయ గలవు.
కామెంట్‌లు