దారం కథ!: - అచ్యుతుని రాజ్యశ్రీ


 ప్రపంచంలో ఎన్నో ప్రాణులున్నా వస్త్రధారణ చేసేది మనిషి మాత్రమే! ఆదిమానవుడు జంతుచర్మాలు చుట్టుకున్నాడు.ఆపై చెట్లబెరడు ఆకులు నారతో అల్లిన వస్త్రధారణ తో నాగరికత ఆరంభమైనది.గొర్రెబొచ్చుతో కంబళ్లు ఉన్నిదుస్తులు దూదివడికి నూలు ఆపై సింథటిక్ వి వాడుతున్నాం. ఉన్ని గొర్రెబొచ్చుతో దుస్తులు మొదట మెసపొటేమియాలో తయారైనాయి. పట్టువి చైనాలో పుట్టాయి. జ్యూట్ నూలు వి భారత్ నించి వివిధ దేశాలకు పయనించాయి.హరప్పా నాగరికత లో ఎగుమతులు పెరిగినాయి.రోమన్ కథనం ప్రకారం అరాకనీ అనే మహిళ నేత పనిలో వాసికెక్కింది. దేవత మినర్వా కన్నా మిన్న గా ఖ్యాతి గాంచింది. అసూయ తో మినర్వా ఆస్త్రీని సాలీడు కమ్మని శపించింది.అంతే అలా సాలీడు తనచుట్టూ గూడుకడుతూ బతుకుతోంది.
ఇక పట్టువస్త్రం ఉత్పత్తిని గూర్చిన కథ ఉంది.చైనాచక్రవర్తి  హువాంగ్ దీ,భార్య లైద్ జూ ఒకరోజు మల్బరీ చెట్టుకింద చాయ్ తాగుతోంది. పట్టుపురుగు ఆతేనీటిలో పడింది.అది కకూన్ కావటంతో సన్నటి దారం రావటంతో అలా పట్టుపురుగులపెంపకం, పట్టుపరిశ్రమ ఆరంభమైనది.అందుకే ఆరాణీని పట్టుదేవతగా ఆరాధించసాగారు. 
ఒకానొకప్పుడు తెలుగుప్రాంతాలు పద్మశాలీలకి నేత లో నేతలుగా ప్రాధాన్యతనిచ్చింది. జానపద గాథలప్రకారం మార్కండేయ ఋషికి 16వ ఏటనే మృతుడవుతాడనే విధివ్రాత రాయబడింది.కానీ శివానుగ్రహంతో బ్రతికిబట్టకట్టాడు. తన కృతజ్ఞత ప్రకటిస్తూ  ఆఋషి తన కొడుకైన భావనాఋషికిఇలా ఆదేశమిచ్చాడు" దేవతలకి వస్త్రాలు తయారుచేసే పూచీ నీదే" అని.అలా ఆయన వంశస్థులే నేత గాళ్లు ఐనారు.భావనాఋషి కి తొలి దారం విష్ణువునాభినుంచి వచ్చింది.అందమైన వస్త్రంనేసి దేవత లకిస్తే, శివుడు నిరాకరించాడు. ఎప్పటికీ చిరిగిపోనిది కావాలని అడిగాడు.దానికై భావనాఋషి బైలుదేరాడు. ఓదేవతకన్పడి పెద్దపులిని ఇస్తే,దానిపై బూడిద చల్లగానే తన చర్మాన్ని విడిచేసింది.ఈపులిని ఋషి శివునికి బహూకరిస్తే, శివుడు పులిచర్మాన్ని ధరించాడు. అలా పశుపతి పులితోలు కప్పుకొన్న  వానిగా దర్శన మిచ్చాడు🌹
కామెంట్‌లు