ద్వార పాలకులు మంథర గూర్చి శత్రఘ్నుడికి దెలుపుట: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట



ద్వారపాలకులు మంథరనుతీసుకొచ్చి
శత్రఘ్నునకు ఆమె గూర్చి తెలుపుట 
పాపాత్మురాలైన ఈ మంథర వలన 
ఈ అంతఃపురమున ఘోరము జరిగెను 

అయ్యా! ఈ మంథర కారణముగనే
శ్రీరాముడు వనములకు వెళ్ళెను 
మీతండ్రి దశరథమహారాజు మరణించెను 
ఇట్టి క్రూరురాలైన మంథరను శిక్షించుము 

శత్రఘ్నుడు వారు తెలిపిన మాటలు విని
ఆ మంథరను గట్టిగా పట్టుకొని లాగెను 
అది పెడబొబ్బలు పెట్టుతూ అరిచెను
దానిని నేలపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లును

అది ధరించిన నగలన్నీ చెల్లా చెదురాయెను
మంథరను విడిపించుటకై కైకేయి వచ్చెను 
అతడు ఆమెను ధిక్కరించి కఠోరముగా పలికెను 
అతని మాటలకు కైకేయి దుఃఖించెను 

భరతుడు వచ్చి అతనిని శాంతింపజేసేను 
ఆడవారిని చంపినచో పాపము తగులును 
శత్రఘ్నుడు ఆ మంథరను వదిలిపెట్టెను 
గూనిది భయముతో ఆమెవైపు చూడసాగెను.

================================
అయోధ్యకాండ మందు 78వ సర్గ సమాప్తము 🙏🏻
కామెంట్‌లు
Popular posts