అవని అంతా ఉషోదయ వెలుగు రేఖలు పరుచుకొంటుండగా
మలయ మారుతవీచికలు
మంజుల వీణా నాదాలు మ్రోగించ
మణిమయ మకుట
ధారినివై స్వర్ణకళశ
హస్తినివై చిలకపచ్చ
పట్టు పీతాంబరముతో పచ్చలపతకముతో
ఘల్లు ఘల్లు మని
చిరుగంటల వజ్రాల
వడ్డాణం సవ్వడి చేయగ పలుకసర్ల మేలిమి పట్టెడతో
నాను జిగిని గొలుసులు
కంఠమున మెరవగా
ముత్యాల మొలనూలు కటిసీమన కళకళ లాడగా తళుకులీనుతున్న
గుత్త కాసులపేరు
అందంగా అమర
హేమమయ కంకణాలు ఎర్రే ర్రనిగాజులు కరముల
గలగల సవ్వడి చేయ
కరుణ కురిపించే చల్లని కన్నులతో
నెలిమేఘ ఛాయబోలు నల్లని కురులతో నీలవేణి
నిత్యసంతోషిణి
పద్మపూ వన్నెలతో
పరమాత్ముని పట్టపురాణివై ఆదిలక్ష్మివై ధనలక్ష్మివై
ధైర్యలక్ష్మివై గజలక్ష్మివై విజయలక్ష్మివై విద్యాలక్ష్మివై ధాన్యలక్ష్మివై సంతానలక్ష్మివై
అష్టలక్ష్మీ రూపమై
మంగళప్రదాఇనీవై
అశ్రీతుల రక్షించవమ్మ
అఖిలాండనాయకి
అతివలు మల్లెలు మొల్లలు మాలతీ పువ్వులు కనకాంబరమ్ములు
కలువపూగుత్తులతో నిండైన అలంకరణతో
మెండుగా కొలువ
నియమ నిష్ఠలతో
వరలక్ష్మి వ్రతమాచరించి వేడుకొనగా ముత్తైదువలు ముదముతో మంగళ
హారతులు పాడగా
పసుపు కుంకుమల సౌభాగ్యమిమ్ము సిరిచందనవల్లి శ్రీకరీ
ముదితలు భక్తితో వండిన క్షిరాన్నా
పూర్ణాలు నీటిగారెలు తీపివంటకాలు మేలైన పిండివంటలు నైవేద్యంగా స్వీకరించి
సకలసంపదలు నొసుగుమా కల్యాణి
కలహంస నడకలతో
కళాభాషిణి కామితార్థ
ప్రదాయిని కమలాసన
అమృతసిరులు ఒలికించ దయచేయుమమ్మా!
అష్టలక్ష్మి మాతా లోకపావని జనని శ్రీమహాలక్ష్మి భక్తజన
కల్పవల్లి శ్రీవరలక్ష్మిమాత!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి