ధారూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం
వికారాబాద్ జిల్లా ధారూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతలు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్, ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మరణార్థం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తాండూర్ కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు, సోషల్ వర్కర్ KVM వెంకట్ పాల్గొని మాట్లాడుతూ...
తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శనం చిరస్మరణీయమని, నీళ్లు–నిధులు–నియామకాల కోసం ఆయన చేసిన కృషి తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
అలాగే ప్రజా గాయకుడు గద్దర్ తన పాటల ద్వారా సామాజిక చైతన్యం రగిలించి, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు.
విద్యార్థులు మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవ, మానవతా విలువలతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొని మహనీయులకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని స్రవంతి ఉపాధ్యాయులు నాగరాణి ,స్వప్న, సరస్వతి, పార్వతి పారిజాత
రాజేశ్వరి ఉమారాణి సంగీత సుజాత శ్రీలత పుష్పలత సంగీత ఫాతిమా ఉపాధ్యాయులు శివ విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి