కృష్ణుడి చూపు: - - యామిజాల జగదీశ్


 ఉదయపు పసిడి వెలుగుల్లో గోకులమంతా భక్తి, ఆనందాలతో నిండిపోయింది. బ్రజవాసులు తమ పనులకు వెళ్లేముందు నందుడి ఇంటి ప్రాంగణానికి చేరుకున్నారు.
"అయ్యా, మన కన్నయ్య మనోహరమైన రూపాన్ని చూడనిదే మాకు ఏ పని తోచదు. దయచేసి రోజూ ఉదయాన్నే మాకు బుజ్జి కృష్ణుడి దర్శనం కలిగేలా చూడండి" అని ఎంతో ప్రేమగా అడిగారు.
నందుడు నవ్వి, తన ముద్దుల కన్నయ్యను వాకిట్లో ఒక అందమైన పీఠంపై కూర్చోబెట్టాడు. చిన్నారి కృష్ణుడు పట్టు వస్త్రాలు కట్టుకుని, నెమలిపింఛం ధరించి, పెదవులపై తీపి నవ్వుతో బ్రజవాసులందరినీ నిండైన ప్రేమతో చూశాడు.
కృష్ణుడి ఒక్క చూపుతో అందరి హృదయాలు పరవశించిపోయాయి. కొందరు చేతులు జోడించి నమస్కరించారు, మరికొందరి ముఖాల్లో ప్రీతికరమైన చిరునవ్వు విరిసింది. ఆ బుజ్జి కన్నయ్య తన మురిపించే నవ్వుతో అందరి మనసులనూ దోచుకున్నట్లనిపించింది. ఆ దివ్యమైన దర్శనం తర్వాత అందరూ ఎంతో సంతోషంగా తమ పనులకు వెళ్లారు. 
కామెంట్‌లు