ఎవరిపాపపుశాపమో
ఎవరికోపపుతాపమో
అగ్నికుండపుఅలలుగా
అవనిరాలేఎండలో
కొలిమిపొగలైసెగలుగ
జీవులెన్నోవిలవిల
బీడుభూములవ్యధలుగా
రైతులెన్నోకడగండ్లు
ఎవరితప్పిదకావరం
ప్రకృతిశోషితభానుడు
ఉడుకుసెగలలఉధృతికి
అవనిసలసలకాగునో
ఎండిపోయినచెరువులు
నీటికైఈపోరులు
దప్పికైనతిప్పలతో
దైన్యమాయెనుబతుకులు
నివురుగప్పిననిప్పులే
తనువులన్నీస్నానము
చెట్లుకూల్చినచేతులే
విలయానికిమూలము
పచ్చదనమేకానక
మబ్బులన్నీకనుమరుగు
ఉడుకుపూతలఉక్కతో
మనిషికికలేదునిదుర
హంతకపుఆహస్తము
ధరణిపైఈవిలయము
గ్రీష్మమానీభీష్మము
తగ్గించుమాతాపము
తప్పులన్నీమన్నించి
మానవాలినికావవే
మేఘమైనువ్వుకరిగి
హత్తుకోవామమతతో

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి