ద్వాపరయుగంలో బృందావనంలో ఒక నయన మనోహరమైన ఉదయపు వేళ. ఒక దివ్యమైన తటాకంపై సూర్యడి బంగారు కిరణాలు పడుతూ మెరిసిపోతున్నాయి. ఆ తటాకంలో పెద్ద పెద్ద పచ్చని తామర ఆకులు ఎటు చూసినా పరచినట్లుగా ఉన్నాయి. వాటి మధ్యలో గులాబీ, తెలుపు రంగు తామర పూలు సువాసనలు వెదజల్లు తున్నాయి.
అలాంటి ఒక అందమైన ప్రశాంతమైన చోట చిన్నారి కృష్ణుడు తన మిత్రులతో కలిసి ఆడుకుంటున్నాడు. కృష్ణుడు పచ్చటి వస్త్రాలు తొడుక్కుని, తలలో నెమలి పింఛం ధరించాడు. ఆయన చుట్టూ ఉన్న మిగిలిన పిల్లలు పెద్ద తామర ఆకుల మధ్య కూర్చుని నవ్వుతున్నారు, చప్పట్లు కొడుతున్నా రు. పూలతో ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. పిల్లలు కొందరు నీటిలోని చిన్న పిల్లలను చూసి మురిసిపోతుంటే, మరికొందరు తమ స్నేహితులకు తామర పూలను అందిస్తారు.
కృష్ణుడి తీయటి చిరునవ్వు ఆ పిల్లల సంతోషాన్ని మరింత పెంచింది. ఆడుకుంటూనే వాళ్లు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి ఆనందిస్తున్నారు. పక్కనే నెమళ్లు తిరుగుతున్నాయి. ఆవులు, దూడలు ప్రశాంతంగా తటాకం ఒడ్డున నిలబడి ఉన్నాయి. పక్షుల కిలకిల రావాలు ఆ ప్రాంతమంతటినీ భక్తిరసంలో ముంచెత్తుతున్నాయి.
ఈ సన్నివేశం అమాయకపు బాల్యం, నిజమైన స్నేహం, ప్రకృతిపై ప్రేమను చాటుతోంది. పెద్ద పెద్ద తామరాకుల మధ్య చిన్నారి కృష్ణుడు, ఆయన స్నేహితులు ఆడుకున్న ఆటలు మనకు మన బాల్యాన్ని గుర్తుచేస్తాయనడం అతిశయోక్తి కాదు. ప్రేమ, సంతోషం నిండిన మనసు ఉంటే ఏ ప్రదేశమైనా స్వర్గంలా మారిపోతుంది కదూ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి