తొలిసారి మెధక్ కాంప్లెక్స్ సమావేశంలో బాలసాహిత్య సృజన కార్యాశాల
  ఆర్.బి.ఐ జనరల్ మేనేజర్ హేమలత గారిచే రచన కళ పుస్తకావిష్కరణ...
         

 శాంతా-వసంతా ట్రస్ట్ ,  తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వారి సౌజన్యంతో సృజనాత్మక సాహిత్య కార్యశాల హవేళి ఘణపూర్, మెదక్, కొల్చారం మండలాల తెలుగు పాఠశాల సముదాయ సమావేశం కూచన్ పల్లిలో విద్యార్థులకు ఉపయోగపడే రచనా కళ పుస్తకావిష్కరణ ఆర్.బి,ఐ జనరల్ మేనేజర్ హేమలత, యం.ఇ.ఓ మదుమోహన్, లీడ్ బ్యాక్ మేనేజర్ బాపూజీ లు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆర్బిఐ జనరల్ మేనేజర్ హేమలత మాట్లాడుతూ మాతృభాష అన్ని భాషలకు మూలాధారమన్నారు. యం.ఇ.ఓ మదుమోహన్ మాట్లాడుతూ తెలుగు భాషోపాధ్యాయుల సేవలు పాఠశాలలో మరువలేనివని, విద్యార్థుల రచనకు ఉపయోగపడే రచనా కళ పుస్తకం అన్ని పాఠశాలల గ్రంథాలయాలలో ఉండాలన్నారు. ఆర్పీలు ఉండ్రాళ్ళ రాజేశం, ఎల్లయ్య ఉపాధ్యాయులు సత్యనారాయణ, శశికుమార్, అశోక్, ఉస్మాన్, రాజు, నరేష్, యాదగిరి, రామానుజ, శ్రీలత, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు