పట్టుదలకు వారసులం
అలుపెరుగని సైనికులం
చిన్ని పాదచారులం
క్రమశిక్షణ మాకిష్టం
వాసనలను పసిగడతాం
కలిసిమెలిసి మేముంటాం
కష్టాలకు మేం వెరువం
నేలను మేం తొలిచేస్తాం
పుట్టలనే నిర్మిస్తాం
పాములకవి వదిలేస్తాం
నిరంతరం శ్రమియిస్తాం
తీపి యనగ మాకిష్టం
మిఠాయిలను కనిపెడతాం
సారమంతా లాగేస్తాం
డొల్లచేసి వదిలేస్తాం
శక్తినసలు మేం దాచం
ఖాళీగా మేముండం
ఎవరిజోలికి మేం వెళ్ళం
జోలికొస్తే కుట్టి పెడతాం
ఐక్యతయే మా సూత్రం
పని చేయుటే మా మంత్రం
శక్తికి మించి మేం మోస్తాం
శ్రమసౌందర్యం మా నేస్తం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి