(తేటగీతి పద్యములు )
వచ్చె శ్రావణ మాసము వైభవముగ
సిరుల తల్లిని పూజించి స్థిరమతులయి
వ్రతము సల్పిన మహిళలు వాయనముల
బంచుచుందురు శుభముల బడయ గోరి./
తల్లి వరలక్ష్మి ధరణికి తరలి వచ్చి
వరము లొసగును బ్రియముగ భక్తతతికి
జగము లేలెడి జననికి జయము పలికి
జనులు జీవింప జాతిలో శాంతి పొలయు./
బాల కృష్ణుండు జన్మించె వసుధ యందు.
పరమ పావన మూర్తికి ప్రణతి మీర
స్వాగతంబును పలుకుచు జనులు కలిసి
వేడుకలు చేసి గంతులు వేయు చుండ్రి.
సోదర ప్రేమ చూపుచు శుభము కోరి.
రక్ష కట్టిరి మహిళలు భ్రాతలకిట
బాస చేసిరి సోదరుల్ భయము బాప.
సంప్రదాయమున్ గన కల్గు సంతసంబు.
భరత దేశపు సంస్కృతీ వైభవమును
చాటి చెప్పెడి నోములన్ సందడించి
చేయు చుండిన ప్రజలకు శ్రీలు కలుగు.
దేశ కీర్తి ప్రకాశము దిశల నిండు.//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి