గతంలో అమెరికాను ఓ కొత్త వ్యాధి గజ గజ వణికించింది. ఇప్పటికే జంతువుల నుంచి వ్యాప్తి చెందే అనేక అంటురోగాలతో అవస్థలు పడుతున్న అమెరికా అప్పుడు జింకలను చూస్తేనే భయపడి పోయింది. ఇంతకూ ఆ వ్యాధి ఏంటో తెలుసుకుందాం...
వన్య మృగాలైన జింకలు, దుప్పిల్లో విస్తృతంగా వ్యాప్తిస్తూ వాటి ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తు న్న ‘జొంబీ డీర్’ వ్యాధిపై అక్కడి వైద్య నిపుణులు గగుర్పొడిచే విషయాన్ని బయటపెట్టారు.
‘జొంబీ డీర్’ అనగా క్రానిక్ వాస్టింగ్ డిసీజ్, సీడబ్యుడీ అని పిలిచే భయంకరమైన వ్యాధి ఆనవాళ్లు ఇప్పటివరకూ జింక, దుప్పి జాతుల్లో మాత్రమే కనిపించాయి. కానీ ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందన్నది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమే అగ్రరాజ్య ఆరోగ్య శాఖను పరుగులు పెట్టించింది. సీడబ్యుడీ వైరస్ సోకగానే దాని లక్షణాలువెంటనే బహిర‍్గతం కావు.
శరీరం మొత్తంలో విస్తరించి న తర్వాత గానీ ఈ వ్యాధి సోకినట్లు అర్థంకాదు. దీంతో ఈ వ్యాధి తీవ్రత గురించి ఆందోళన పడాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమెరికాలోని ఇలినాయిస్ సహా 24 రాష్ట్రాలతోపాటు, రెండు కెనడియన్ ప్రావిన్స్ లో జొంబీ డీర్ వ్యాపించి ప్రజలను గడగడలాడించింది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెప్పారు.
1960లో కొలరాడోలో, అడవి జింకలో 1981లో మరోసారి గుర్తించామన్నారు. ఈ వ్యాధి మనుషులకు సోకిన కేసులను గుర్తించనప్పటికీ, మానవులకు సోకే ప్రమాదం లేకపోలేదని గట్టిగా హెచ్చరించారు. జొంబీ వైరస్ సోకగానే బరువు తగ్గిపోవ డం, బాగా దప్పిక వేయడం, నోటినుంచి చొంగ కారడం లాంటి సంకేతాలు కనిపించాయట. వేలకొద్దీ జింకల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. అలాగే వీటి శారీరక ద్రవాలు మలం, లాలాజలం, రక్తం లేదా మూత్రంలో ఉన్న సీడబ్యూడీ వైరస్ ఎక్కువకాలం పర్యావరణంలో చురుకుగా ఉంటుంద ని సైంటిస్టులు చెప్పారు. ఇవి క్రమం గా మనుషులకు కూడా సోకుతాయని తేల్చారు. మరోవైపు దీని నివారణకు అప్పటికప్పుడు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు మరింత ఆందోళనకు దారి తీసింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి