..బానిసత్వం: - ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-సెయింట్ లూయిస్ -అమెరికా


యుక్తా యుక్త విచక్షణ కలిగిన మానవజన్మ నెత్తి 
మంచి చెడులను తెలుసుకుని 
నిరంతర సాధనతో ఎవరో వస్తారని 
ఏదో చేస్తారని ఆశపెట్టుకోక
నీ కర్తవ్యాన్ని నీవే నెరవేర్చుకుని
బానిసవై ఒకరిపై ఆధారపడక
జీవించిన మానవుడు ఆదర్శవంతుడు.

శాంతి అహింసలే సాధనాలుగా భరతమాత దాస్య శృంఖలాలను విడిపించి 
స్వాతంత్య్ర  సముపార్జన చేసిన మహాత్మా గాంధీ 
చిరస్మరణీయులు
వెట్టి చాకిరితో అవమానాలు పడుతు 
పిడికెడు మెతుకుల కోసం బానిసత్వంతో బాధ పడే నిర్భాగ్యులు
జాతస్యహి ధ్రువో మృత్యు: అని తెలిసినా 
అంటరాని తనం కుల మత బేధాలతో
బానిసత్వపు సంకెళ్ళకు
నేటికి బందీలుగా నిలవడం 
అర్థనారీశ్వరతత్వానికి ప్రతీక అని చెప్పే 
భార్య భర్తల మధ్య అసమానత 
తోడు నీడగా ఉండే భాగస్వామిపై ఆధిపత్యం 
ఎన్నని ఏమని చెప్పను 
అనాదిగా వచ్చే బానిసత్వ బ్రతుకులు అంతమై 
ఓటమి కి ప్రధాన సోపానమైన బానిసత్వం అంతరించి 
సమ సమాజ నిర్మాణం ఏర్పడేదెప్పుడు?
మహాత్ముడు కలలు కన్న రామరాజ్యం ఏర్పడాలని ఆశీస్తు 
స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో అసూయ ద్వేషాలు లేని 
సమాజం ఏర్పడడానికి దోహదపడదా0..!!
................................

కామెంట్‌లు