సుప్రభాత కవిత : - బృంద


వెలిగే తూరుపు 
బంగరు నవ్వులు 
ఎగిరే గువ్వల 
ఎగసే నవ్వులు 

తేలే మబ్బుల 
వెండి నవ్వులు 
సాగే ఏటికి 
జిలుగుల నవ్వులు

పచ్చని లోయల 
వెచ్చని నవ్వులు 
తచ్చాడే కాంతుల 
చిలిపి నవ్వులు

రాలే పువ్వుల 
రాగాల నవ్వులు 
ఊగే కొమ్మల 
ఆకుల నవ్వులు

నేలను పరచిన 
పచ్చిక నవ్వులు 
మొక్కకు పూసిన 
మొగ్గల నవ్వులు

చక్కని ప్రకృతి 
చిక్కని సొగసులు 
మక్కువగా చూసే 
మనసున నవ్వులు 
 
అందరికీ చెందినా 
ఎవరికి సొంతం కాని
ఎవరినీ ఏమీ కోరని 
ఎనలేని నవ్వులు...

కాంతులు పంచే 
కశ్యపాత్మజుని  చూడ 
కన్నుల పండుగ కాగా 
కదిలే పెదవుల నవ్వులకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు