హలో పిల్లలూ! చాలా మంది ఇళ్ళలో క్రోటన్ చెట్లుంటాయి! మా ఇంట్లోనూ ఉన్నాయి అయితే వాటితో ఏదో ఒకటి చెయ్యాల్సిందే కదా! మరి మా ఇంట్లో ఉన్న క్రోటన్ చెట్ల పండిన ఆకుల్ని తీసుకుని అమ్మాయిని చేశాను. రోడ్ల మధ్యలో డివైడర్ల మీద పెంచే తెల్లని పువ్వుల ఆకుల్ని, కొబ్బరి కాయ పిందెల్ని, కుంకుడు విత్తనాలు, దానిమ్మ పిందెలు, దానిమ్మ పూలు, క్రిస్మస్ చెట్టు అకులు ఇంకా చాలా ఆకులు వాడాను. క్రోటన్ చెట్లకు పూలు తక్కువగా ఉంటాయి కానీ ఆకులే రంగురంగులలో ఉండడం వలన ఆకర్షణీయంగా ఉంటాయి. గార్డెన్ లలో అలంకరణ కోసం ఎక్కువగా పెంచుతారు. ఇళ్ళలో కూడా అందం కోసం ఎక్కువగా పెంచుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా అలంకరణలకు క్రోటన్ ఆకులు ప్రసిద్ధి చెందాయి. ఇవి ఉష్ణ మండల ప్రాంతాలకు చెందినది. ఈ చెట్లు ఆస్ట్రేలియా, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలకు చెందినవి. ఇవి గుబురుగా పొదల వలె పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఎండనూ, వేడినీ ఇష్టపడతాయి. నేల ఎప్పుడూ తేమగా ఉంటే బాగా పెరుగుతాయి. ఈ ఆకులు ఎరుపు. నారింజ గులాబీ, ఉదా, ఆకుపచ్చ పసుపు రంగులలో అద్భుతంగా ఉంటాయి. క్రోటన్ చెట్ల శాస్త్రీయనామం “కోడియం వేరి గేటమ్”. ఎండ తగిలాక ఆకుల రంగులు ప్రకాశంగా మారతాయి.
రెండు పసుపు రంగు ఆకులను తల, మొండెం తయారు చేశాను. కళ్ళకు కుంకుడు గింజలు పెట్టాను. తల మీద జుట్టు కోసం కొబ్బరి పిందెల్ని పెట్టాను. కొబ్బరి చెట్టు నుంచి రోజూ పిందెలు రాలుతుంటాయి. వాటిని దాచుకున్నాను. గద ఆకారపు ఆకులు, క్రిస్మస్ చెట్టు ఆకులు పెట్టి కుచ్చిళ్ళు కుట్టి లంగాను అందంగా కుట్టాను. చెవులకు లోలాకులుగా దానిమ్మ పిందెల్ని అమర్చాను. పెదవుల కోసం దానిమ్మ పూల రెక్కల్ని వాడాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి