ప్రేమ శక్తి: - - యామిజాల జగదీశ్
 

భారతీయ పవిత్ర సంప్రదాయంలో శ్రీ రాధాకృష్ణుల ప్రేమ ఒక అద్భుతమైన నిదర్శనం. ఇది ప్రతీ యుగంలో స్వార్థం లేని ప్రేమకు అసలైన అర్థం చెప్తుంది. ఈ బంధం కేవలం రెండు హృదయాల కలయిక మాత్రమే కాదు. ఆత్మ పరమాత్మను కలిసే ఒక దివ్యమైన దృశ్యం. త్యాగం, అంకితభావంతో నిండిన ఒక అలౌకిక గాథ.
రాధాకృష్ణుల ప్రేమ ఏ ప్రాపంచిక పరిమితులకు లొంగదు. వీరి ప్రేమ బృందావనం పవిత్ర వీధుల్లో మొదలైంది. అక్కడ కృష్ణుడి మురళీ గానం వినగానే రాధ సమస్తం మరచిపోయి ఆయన వైపు అడుగులు వేసేది. వారి మధ్య ఎలాంటి షరతులూ లేవు, కోరికలూ లేవు. కేవలం ఒకరిలో ఒకరు లీనం కావడం అంటే లోతైన అనుభూతి మాత్రమే.
ఈ పవిత్ర ప్రేమ గొప్ప శక్తి త్యాగం. ధర్మం, బాధ్యత రక్షణ కోసం కృష్ణుడు మధుర, ద్వారకలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రాధ ఎలాంటి ఫిర్యాదు లేకుండా పంపించింది. ప్రేమ అంటే బంధించడం కాదు, తనకు ఇష్టమైన వ్యక్తి వారి బాధ్యతల బాటలో ముందుకు సాగడం చూడటమే ప్రేమ అని రాధకు తెలుసు. దూరం పెరిగిన వారి మానసిక బంధం ఇంకా బలంగా మారింది.
కామెంట్‌లు