అస్తమించనిసంధ్య: - పంచదార్ల మాణిక్యాలరావు
 

అరచేతిరేఖల్లోఅరిగిపోయిన
ముగ్గుపిండిలాప్రతిఉదయం
వాకిలిపైతననుతానుపరుచుకుంటుంది
పప్పులడబ్బాల్లోదాచుకున్న
చిల్లరనాణేల్లాచిన్నచిన్నసంతోషాలు
ఎప్పుడూఅడుగునేఉండిపోతాయి.
తాళిబరువునుమెడలోకాదు
రెప్పలపైమోస్తున్ననిశ్శబ్దతపస్విని
మరిగేచారుగిన్నెలోఆవిరైపోతున్న
నీటిచుక్కలాతనఉనికినిఇల్లంతా
సుగంధంలావెదజల్లుతూనేఉంటుంది.
గోడలసున్నపుపొరలవెనుక
ఎన్నితడిజ్ఞాపకాలుఇంకిపోయాయో?
చొక్కాలముడతలుతీసేఇస్త్రీపెట్టెలా
మనసులోనినలిగినకోరికలనుమాత్రం
ఇనుపపెట్టెలోభద్రంగాదాచేస్తుంది.
పొయ్యిసెగలోకాలినరొట్టెపైమచ్చల్లా
అనుభవాలగాయాలువెన్నెలైమెరుస్తుంటాయి
అరుగుపైవాలినఒంటరిపిట్టలా
ఆకాశంవైపుచూస్తూ..మళ్ళీ
గూటిపనుల్లోకేఒదిగిపోతుంది.
అక్కరలకోనలోనీడనిచ్చేమహావృక్షం
తనవేర్లదాహాన్నిగుర్తించేతీరిక
ఎవరికీఉండదు..ఎవరికీఉండదు!
ఆమెఒకఅంతులేనిమహాకావ్యం
అక్షరాల్లోకిరాని..అనుభవంలోకి
మాత్రమేవచ్చేఅనురాగరాగం.
కామెంట్‌లు