చల్లని తెల్లని
మన దేశ సంస్కృతికి భద్ర పేటికెలు.
,
నగరమై వెలిసినా ప్రగతి
సాధించినా మరువలేదు
తెలంగాణ ప్రజలు మహనీయుల జాడలు
సామూహిక సాంస్కృతిక వారసత్వఐక్యత.
పోచమ్మ మల్లమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ పోలేరమ్మ
వీ రంతా తెలంగాణ ప్రజల గుండెలలో
నిండిన ఆరాధ్య దైవాలు.
ఆషాడ మాసమది ఆనంద మాసం.
బోనం, భోజనానికి వికృతి. ఆడంబరాలతో కాదు భక్తితో శక్తిని పూజించే ఆతల్లికి భోజనమిచ్చే
జనుల శ్రద్ద
వర్ణనాతీతం
గోల్కొండలో
సింహవాహిని.
పాతబస్తీలో లాల్ దర్వాజా ఇంకా ఎన్నో ఇతర దేవాలయాల్లో
పాలు బెల్లం కలిపిన అన్నం పూలతో అలంకరించిన
బోనంకుండ తల మీదుండ తెలంగాణ తరుణులు
పట్టు చీరలతో పుట్టింటికి వచ్చిన అమ్మకు బోనాలు స
మర్పించటమే బోనాల పండుగ
ఈ సందట్లో
మరెన్నో న్సందళ్ళు
అమ్మవారితమ్ముడు పోతరాజు వీరంగం,
భవిష్యత్తు చెప్పే "రంగం" ఆటలు పాటలు, మాటలలో వివరించలేని
మధురమైన అనుభవమది
బోనాల పండుగ
నగర వాసులు
నగరవాసనలకు
విసుగెత్తి ఉత్సాహంతో ఉరకలేస్తూ చేసుకునే
బోనాల పండుగ వారి మనసులకు గొప్ప భోజనాల పండగే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి