వినగలిగే వీనులు ఉంటే
అనుభూతి చెందే హృదయముంటే
ప్రకృతిలో ప్రతి ధ్వనీ ఒక రాగమై పలుకుతుంది
నదుల ప్రవాహం, జలపాతాల జోరు
చిరుగాలి సవ్వడి, కోయిల రాగం
పక్షుల కిలకిలారావం అన్నీ
మనసుకు మధురమైన అనుభూతినిస్తాయి
సాహిత్యం మన జీవనాడి
తరతరాల సంస్కృతులకు నిలయం
వేదననైనా, తీపి మధురిమనైనా
ప్రతి భావాన్ని తనలో ఇముడ్చుకుంటుంది
ఆవేశమయినా, ఆలోచన అయినా
విరహమైనా, కలయిక అయినా
అక్షరాలకు అందాన్ని అద్దుతుంది
మనసులకు స్ఫూర్తిని అందిస్తుంది
సంగీతం మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది
సాహిత్యం జీవితానికి వెలుగుబాట చూపిస్తుంది
రెండూ మానవ జీవితానికి గొప్ప వరాలు
లలిత కళలతో మానవ జీవితం పరిపూర్ణం
మనిషిగా పుట్టినందుకు చేయాలి
కళల రసాస్వాదనం
సంగీతాన్ని ప్రేమిద్దాం, సాహిత్యాన్ని గౌరవిద్దాం
మన సంస్కృతిని తరతరాలకు
వారసత్వంగా అందిద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి