రెక్కలు వచ్చిన పిల్లలు: - బి.ఉషారాణి-Govt టీచర్-మంచిర్యాల


రెక్కలు వచ్చిన పిల్లల స్వేచ్ఛను
గగనం అంచులకు చేరనిద్దాం,
వారి రేపటి కలల సౌధాలను
నిర్మించేందుకు సాయపడదాం.

వారేగా భావి భారత పౌరులు,
వారేగా భవిష్యత్ ఆశాజ్యోతులు,
ప్రగతిపథానికి దారులు వేసే
నవభారత నిర్మాతలు.

వారి మనసులోని భావాలను,
ఆలోచనలను పంచుకునేలా చేద్దాం,
వారి అభిరుచికి అనుగుణంగా
భవిష్యత్తును మలచుకునే అవకాశమిద్దాం.

మన ఆశలను వారిపై రుద్దకుండా,
మన కలలకు వారిని బలిచేయకుండా,
వారి ఆశయాలకే విలువనిచ్చి,
వారి అడుగులకు అండగా నడుద్దాం.

వారి కలల రెక్కలు ఎగిరేందుకు
అవకాశాల ఆకాశం నిర్మిద్దాం,
వారు ఎగిరే ప్రతి ఎత్తులో
వారి మోముపై చిరునవ్వులు పూయిద్దాం.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
👌👌