ఆటలో గెలుపోటములను సమంగా స్వీకరిద్దాం: - బి.ఉషారాణి-Govt టీచర్-మంచిర్యాల


ఆటాడుకుందాం రండి బాలలూ
ఆనందంగా ఉరకలు వేద్దాం పిల్లలూ
గెలుపు కోసమే కాదు ఆట
ఆటవిడుపుకు కూడా ఆడాలి ఆట

పగలూ రాత్రీ చదువేనా
విజ్ఞానంతో పాటు వినోదం కావాలిగా
మనసులో జిజ్ఞాస పెంచుకుంటూనే
శారీరక దృఢత్వం పెంపొందించుకోవాలిగా

ఆటలు కేవలం పోటీ కోసమేనా
ఆరోగ్యం పెంపొందించుకోవడానికి కాదా
క్రీడలంటే గెలుపోటముల లెక్కలేనా
మానసిక ఉల్లాసాన్ని పంచే సాధనాలు కావా

ఆటలో గెలిస్తే సంబరం సంతోషం
ఓడితే ఒక మంచి అనుభవం
ఓటమికి భయపడి ఆటలకు దూరమవ్వాలా
ఆట ఆడితే వచ్చే ఆనందాన్ని కోల్పోవాలా

చేయి చేయి కలిపి అడుగులు వేద్దాం
చెంగు చెంగున గంతులు వేద్దాం 
చక చక మంటూ పరుగులు తీద్దాం
చలాకీగా ఎన్నో ఆటలు ఆడేద్దాం

గెలుపోటముల లెక్కలు వేయక
వాటిని సమంగా స్వీకరిద్దాం
ఆట ఆడితే వచ్చే ఆనందమే 
అసలైన గెలుపని చాటేద్దాం
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice
అజ్ఞాత చెప్పారు…
👌👌👌
అజ్ఞాత చెప్పారు…
👌👌
Popular posts