1వ సర్గ ( 2 ): - ఎడ్ల లక్ష్మి , సిద్ధిపేట


భూతభవిష్యత్తులను దర్శింపగల ఆ మహర్షులు
తమ కడకు వచ్చుచున్న రామలక్ష్మణులను 
మహాసాద్వియగు సీతాదేవిని దర్శించి 
మిక్కిలి సంతోషముతో వారికి ఎదురు వెళ్లినారు. 

వనవాసులైన ఆ మునులు శ్రీరాముని సౌందర్యము చూసి 
ఆశ్చర్యచక్కితులై దర్శించిరి.
అద్భుతసౌందర్యమూర్తులైన సీతా లక్ష్మణులను 
ఆ మునులు కనురెప్పలార్పకుండా జూచిరి. 

మహాత్ములైన ఆ మునులు సీతారామలక్ష్మణులకు
ఆశ్రమ సముదాయమున పర్ణశాల యందు 
అతిథి మర్యాదలతో నివసింపజేసిరి.  
ఆర్ఘ్యపాద్యాధులతో శ్రీరాముని సత్కరించిరి.

మహాత్ముడైన శ్రీరామునకు ఫలములను సమర్పించి
ఓ ప్రభూ! ఈ ఆశ్రమము మీదే అని తెలిపినారు
ఓ రామా! మునులందరికీ శరణ్యుడవు 
మేము నీ రాజ్యమున నివసించుచున్న వారము 

ఓ రఘురామా! శత్రువైన క్రోధమును పరిత్యజించితిమి
జితేంద్రియులము తపస్సులే మా సంపదలని దెలిపి 
అగ్నివలె తేజస్సంపన్నులైన ఆ సిద్ధులు
శ్రీరాముని తమ సేవలతో సంతుష్టుని గావించిరి. 

====================================

అరణ్యకాండమునందు ఒకటవ సర్గ సమాప్తము 🙏🏻
కామెంట్‌లు