అంశము: మాతృ దేశ ప్రయాణం
విషయము: పాలమూరు ప్రయాణం
ఛందస్సు: సీసము - ఆటవెలది
మాతృ భూమి తలపు మదిలోన రొద చేయ
దూరతీరపు గుండె భార మెరిగి
ఖండాంతరాలను ఖగరాజు వలె దాటు
వాయు వేగ విమాన పయన మెంచి
పొద్దు మాపుల కలుపు గగన యానము
ముగిసి ఇంటిగడప మొక్కి యిల్లు
చేరిన వేళ నా చెల్లి సప్రేమ ఆ
హ్వానమున తడిసె అశ్రు నయన
ఆటవెలది:
బంధు జనుల జూసి పరవసించెను ఎద
దూర భారపు శ్రమ దూర మవగ
పాలమూరు మైత్రి పాత సోపతి దోస్తి
మధుర స్మృతుల నడుమ మనసు మురియ
######################################
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి