తాను ప్రతిజ్ఞాభంగమునకు పాల్పాడను". అని శ్రీరాముడు సీతాదేవికి స్పష్టపరుచుట
సీతాదేవి పలికిన పలుకులను విని
శ్రీరాముడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను
ఓ దేవీ ! నీవు మహోన్నతమైన
జనకరాజు వంశమును జన్మించినావు.
ఓ సీతా! నీవు ధర్మాత్మురాలవు
నాపై నీకు గల అనురాగము గాఢమైనది
అన్ని విధముల సదావేళలలో నీవు
నా హితము గోరుచు వచించితివి.
ఓ దేవీ! క్షత్రియులు ధనుర్దారులైయున్న చోట
ఆర్ధనాదము వినబడరాదని నీవే అంటివి
నీవు పలికిన మాటలు నేను వింటిని
ఇక నేను చెప్పవలసినది ఏమున్నది
ఓ సీతా! దండకారణ్యమునందు
దీక్షతో తపస్సొనరించుచున్న
ఆ మునులు ఆర్తులై స్వయముగా వచ్చి
నన్ను శరణుజొచ్చిరి వారి రక్షణ నా బాధ్యత
వారు కందమూలములను భుజిస్తూ
ధర్మనిరతులై జీవించుచున్నారు
క్రూరాత్ములైన రాక్షసులు పెట్టు బాధలను
తట్టుకోలేక భయగ్రస్తులై యున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి