అనునాదం..!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


మనకు తెలియని వాళ్లు ఎంత గొప్పగా ఎదిగిన మనం ఈర్సపడం అసూయపడం. అసలు ఆలోచించం  స్ఫూర్తి కూడా పొందం. మామూలుగా మర్చిపోతాం. 
కానీ 

మనకు దగ్గర వాళ్లు  తెలిసినవాళ్లు ఎత్తుకు ఎదిగితే ఈర్ష పడతాం అసూయపడతాం మనసు పాడు చేసుకుంటాం. కానీ వీళ్ళ నుంచి స్ఫూర్తి పొందుతాం పోటీ పడతాం. 

మనకు తెలియనిది అర్థం కానిది ఎంత గొప్పదైన మన మామూలుగానే తీసుకుంటాం మామూలుగానే ఉంటాం. అంటే అమాయకంగానే మిగిలిపోతాం. కానీ దాని రహస్యం తెలిసిన దాని మర్మం తెలిసినా. మనసు పాడు చేసుకుంటాం కసిపెంచుకుంటాం. పగ పెంచుకుంటాం. ఇక మనం మామూలు మనుషులం కాలేం. కొంత సమయం పడుతుంది.

మన శత్రువు ఎవరో మనకు తెలిస్తే. శక్తిసామర్థ్యాల గురించి ఆలోచించవచ్చు. అర్థం కాని శత్రువు అర్థం లేని శత్రువు తో పోరాటం వ్యర్థం సమయం వృధా శక్తి వృధా. 

మన గురించి మనకు పూర్తిగా అర్థమైతే చాలు. దాని నిరూపించుకోవడానికి న్యాయం నిర్ణయించడానికి తపన పడటం వృధా. మన గురించి మనకు పూర్తిగా తెలిసినప్పుడు ఎవరి సర్టిఫికెట్ తో పనిలేదు. 

మనం ఎదగాలనుకున్నప్పుడు అవకాశాలు ఆర్థిక వనరులే కాదు మానవ సంబంధాలు అందరి సహకారం అవసరం సహజం. కానీ కొన్నిసార్లు కావాలని సహకరించకుండా ఉండే మనుషులు ఉంటారు. సమాజము ఉంటుంది. అందువల్ల మన శక్తిసామర్థ్యాలు సమయము వృధా అవుతుంది. పచ్చని జీవితం పండుతాకై రాలిపోతుంది. ఇలాంటి సమాజంలో ఉండడం మన దురదృష్టం. 

కులము మతము దేవుడు జ్ఞానము విజ్ఞానము స్త్రీ శాస్త్రజ్ఞనము మొత్తము రాజకీయము వ్యాపారం మాత్రమే. దీన్ని ఛేదించడం అంత సులభం కాదు ఈ వ్యూహంలో మనమందరము బందీలమే. వీటిలో ఏ ఒక్క దాన్ని వదులుకోలేము ఒంటరిగా బతకలేము. ఎలాగంటే మన మెదడులో చైతన్యం మొత్తం దీనితో నింపబడి ఉంటుంది దీనితో కప్పబడి ఉంటుంది. దీన్ని నుంచి విడిపోయి ఆలోచించాలేం అసలు ఆలోచనలు అన్ని అవే.
==============================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు