110 వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట

వసిష్టుడు శ్రీరాముని వంశక్రమమును వివరించి కోసల 
రాజ్య పరిపాలనను చేపట్టమని  కోరుట




శ్రీరాముడు క్రుద్థుడైయుండుట గమనించి
వసిష్ఠుడు ఆయనతో ఇట్లు పలికెను 
నాయనా! రఘునందనా! జనులు 
ఈ లోకము నుండి పరలోకములకు వెళ్ళుటను
తిరిగి వచ్చుట జాబాలి ఎరుగును 

అతడు నాస్తికుడు కాడు ఓ లోకనాథా!
ఈ వనముల నుండి నిన్ను అయోధ్యకు 
మరలించుటకై అతడు ఇట్లు పలికెను 
ఈ లోకముయొక్క ఆవిర్భవము తెలిపెదను వినుము 

ఈ సృష్టి ప్రారంభ సమయమున 
జలమయమై యుండెను అందునుండే 
ఈ భూమండలము ఏర్పడెను 
పిమ్మట స్వయంభుడైన బ్రహ్మదేవుడు 
దేవతలతో గూడి ఆవిర్భవించెను.

ఆ బ్రహ్మయే వరహా రూపమున ప్రకటితుడై 
జలమగ్నమైయున్న పృథ్విని ఉద్ధరించెను 
అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా
అప్పుడు ఈ జగత్తును సృష్టించెను. 

ఆకాశ స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ నుండి 
బ్రహ్మదేవుడు ప్రాదుర్భవించెను అతడు శాశ్వతుడు 
ఆయన నుండి మారీచి జన్మించెను. 
ఆ మారీచుని కుమారుడే కశ్వపుడు.

కామెంట్‌లు