అంశము : నేపాల్ సరిహద్దులో ఆకస్మిక వరద దుర్ఘటన
విషయము: వేల్పును ప్రశ్నించిన వేదన
ఛందస్సు: ఉత్పలమాల
గంగ భయంకరమ్ముగను గర్జన సేయుచు నేల దూకగా
వంగి శిరస్సు నుంచి సిగ పాయల కట్టడి జేసినట్టి మా
జంగమ దేవరా! ఎటుల జాలిని వీడి నెపాలి సీమలో
తుంగహిమాద్రి రక్కసిగ దూకి జనాళిని మట్టుబెట్టె యా
గంగను నాపకుండుటకు కారణ మెద్దియొ దెల్పు మీశ్వరా?
=====================================
నెపాలి సీమ = నేపాల్ ప్రాంతము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి