అంతర్జాలంలో కాలిఫోర్నియా వీక్షణం సమావేశం శ నివారం ఆద్యంతం అద్భుతంగా జరిగింది. మొదట వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి, భారతీయ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు అతిధులకు కవులకు ఆహ్వానం పలికారు. వీక్షణం వార్హికోత్సవ ప్రత్యేక సంచికను విశిష్ట అతిధి డాక్టర్ నాగబైరవ ఆదినారాయణ, వీక్షణం 2026 సమావేశాల సమీక్ష సంచికను తేళ్ళ అరుణ ఆవిష్కరించారు. రాజేంద్రప్రసాద్ అతిధులను సభకు పరిచయం చేశారు.
నాగభైరవ ఆదినారాయణ ఆవిష్కరించబడిన రెండు పుస్తకాల గురించి బాల వ్యాకరణం గురించి చక్కగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీ నాగభైరవ ఆదినారాయణ ప్రకాశం జిల్లాకు చెందిన వారు.ప్రఖ్యాత కవి నాగభైరవ కోటేశ్వరరావుగారికి సోదరులు.నాగభైరవ సాహిత్య పీఠం వ్యవస్థాపకులు దాదాపు ఎనభై పైగా రచనలు చేశారు. అందులో ' మట్టి బండి ' అనేక భాషల లోకి అనువదించబడ్డది. వీరికి 2002లో ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు వచ్చింది. గిడుగు వారి అవార్డు, ఆచార్య రంగా అవార్డు 2025 లో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. కవిత అందరికీ అర్ధం కావాలి. ఉపమాన ఉపమేయాలు నడుమ భావం చెడరాదు అన్నారు. తదుపరి బాలవ్యాకరణం ఆవశ్యకత గురించి విపులంగా ప్రసంగించారు
శ్రీమతి తేళ్ల అరుణ 40 వత్స రాలకు పైగా మహిళాభ్యుడయానికి, సామాజిక సేవకు పాటుబడుతున్నారు. న ర సం అనే సాహిత్య సంస్థను నడుపుతున్నారు. pekku వర్ణాంతర వివాహాలను చేశారు.
తేళ్ళ అరుణ తాను చేబట్టిన మహిళా అభ్యుదయ కార్యక్రమాల గురించి, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం స్థాపించి చేబడుతున్న కార్యక్రమాలను గురించి మాట్లాడి కవులను ఉత్తేజ పరిచారు. మరో అతిధి రామాయణం ప్రసాదరావు రెండు పుస్తకాల గురించి విపులంగా వివరించి అందరి మనసులను దోచుకున్నారు.
అతిధుల ప్రసంగాలు చక్కగా ఉన్నాయని మౌనశ్రీ మల్లిక్, వసీరా, పాండురంగారావు అభివందనలు తెలిపారు. తర్వాత రాజేంద్రప్రసాద్, డాక్టర్ రాధాకుసుమ సంయుక్త ఆధ్వర్యంలో కవిసమ్మేళనం జరిగింది.
మొదట డాక్టర్ గీతా మాధవి పూలుగుచ్చే దారానికి అనే కవితను చదివి శుభారంభం ఇచ్చారు. నాగబైరవ ఆదినారాయణ పూచికపుల్ల అనే కవితను అమ్మ మీద చదివారు, తేళ్ళ అరుణ వడి కవితను, రామాయణం ప్రసాదరావు బువ్వకుండ అనే కవితను చదివారు. సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ వాక్కు పుట్టుక కవితను, వసీరా ఆవు తోక కవితను, మేడిసెట్టి యోగేశ్వరరావు మా ఊర్లో ఓ ఉదయం కవితను, కొత్తూరి వెంకట్ జన్మదిన గేయం -- ఏడుకొండల వాని దీవెన, ఆది మోపిదేవి అమ్మ ఎప్పుడయ్యింది కవితను, కట్టా శ్యామలాదేవి ఆషాడపు నీలిమబ్బు అందాలు కవితను, అయ్యల సోమయాజుల ప్రసాద్ కన్నీటి వర్షం కవితను, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి చైతన్యమే నా ఊపిరి కవితను, పరిమి వెంకట సత్యమూర్తి భారతమాత ముద్దుబిడ్డ ... రతన్ టాటా కవితను, డాక్టర్ దేవులపల్లి పద్మజ వినాయకుడి గీతం, వడ్ల వీరాచారి సిద్ధి వినాయక నమామి కవితను, డాక్టర్ కోదాటి అరుణ శ్రీ విఘ్నేశ్వర కవితను వినిపించారు. డాక్టర్ బృందా ఓజోన్ మన రక్షణ కవచం కవితను, బుక్కపట్నం రమాదేవి మాటే మంత్రం కవితను, సి. రమాదేవి కరిగిపోతున్న భవిష్యత్తు కవితను, శ్రీలత దావన్ మిడిసిపాటు కవితను, శ్రీగిరిరాజు పాండు రంగారావు కురిసింది అక్షరవాన కవితను, ఆనం ఆశ్రితారెడ్డి గంగ నేను కవితను, భోగెల ఉమామహేశ్వరరావు దైవం ఎక్కడ ఉన్నది కవితను, ఉప్పలపాటి వెంకట రత్నం తెలుగునుడి కవితను, చిట్టాబత్తిన వీరరాఘవులు ఊహా సుందరి కవితను, పాటిబండ్ల కవిత ఆకాశ హర్మాలు కవితను, ఆలపాటి అమ్మాయి ఙ్ఞాపకాల వాన కవితను, నాగేంద్రమ్మ ముత్యాలసరాలు పాటను, కూలూరి విశాలక్ష్మి కెరటం నాకు ఆశాదీపం కవితను, కాకర్ల రమణయ్య వెలుగు రవ్వ కవితను, రాధా కుసుమ కొందరు అంతే కవితను, వడ్డేపల్లి నరసింగరావు స్వాతంత్ర పోరాటంలో చేనేత కవితను ఆలపించారు. చివరగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కవి గళం విప్పితే అనే కవితను ఉద్వేగంగా పాడి అందరి మన్ననలను పొందారు.
గీతా మాధవి అతిధులకు అభివందనలు, కవులకు ధన్యవాదాలు చెప్పి సభను ముగించారు. సమావేశం బాగా జరిగిందని అందరూ సంతోషం వ్యక్తపరిచారు.
==========================================================
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, వీక్షణం భారతదేశ పతినిధి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి